Home > జాతీయం > Launch BeeYoung Beer : మద్యం ప్రియులకు శుభవార్త.. సౌత్ మార్కెట్‌లోకి కొత్త సరుకు

Launch BeeYoung Beer : మద్యం ప్రియులకు శుభవార్త.. సౌత్ మార్కెట్‌లోకి కొత్త సరుకు

Launch BeeYoung Beer : మద్యం ప్రియులకు శుభవార్త.. సౌత్ మార్కెట్‌లోకి కొత్త సరుకు
X

దేశ, విదేశాలకు చెందిన మద్యం బ్రాండ్‌లను కనీసం ఒక్కసారైనా ట్రై చేయాలని మద్యం ప్రియులు ఉబలాటపడుతుంటారు. మార్కెట్‌లో కొత్త రకం సరుకు వచ్చిందంటే చాలు.. ఖర్చుకు వెనుకాడకుండా ఆ బ్రాండ్‌లను కొని తాగి సరదా తీర్చుకుంటారు. ఇక కంపెనీలు సైతం లిక్కర్ ప్రేమికుల అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. గత నెలలో సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా-కోలా సైతం ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీకి చెందిన కూల్ డ్రింక్ తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బెవరేజెస్‌ను సౌత్ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలో కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ లాగర్ బీయంగ్ బీర్‌ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడులో ప్రవేశపెడుతుందని చూస్తున్నట్లు కిమాయా హిమాలయన్ బెవరేజెస్ వ్యవస్థాపకుడు, CEO అభినవ్ జిందాల్ వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల తర్వాత తెలుగురాష్ట్రాల్లో కూడా విడుదల చేయాలని భావిస్తోంది ప్రస్తుతం ఈ ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, ఉత్తరాఖండ్‌తో సహా 5 మార్కెట్‌లలో విక్రయించబడుతోంది. కంపెనీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్‌ మార్కెట్లలోకి ప్రవేశించింది. రుచి, సువాసనతో కూడిన తేలికపాటి బీర్ లక్షణాలతో ఉండే స్ట్రాంగ్ ఫీల్డ్ బీర్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఇది తయారు చేసిందని కంపెనీ వెల్లడించింది. అందువల్ల ఈ బీర్ మార్కెట్‌లో విలక్షణమైనదని జిందాల్ చెప్పారు. సెప్టెంబరు 2019లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి మార్చి 2023 నాటికి అమ్మకాల కేసులు 1,25,000 నుంచి సుమారు మిలియన్‌కు పెరిగాయి. ఇది 96 శాతం రిటైల్ అమ్మకాలతో ఆఫ్-ప్రిమైజ్‌పై ఎక్కువగా దృష్టి సారించింది.




Updated : 1 Jan 2024 12:29 PM IST
Tags:    
Next Story
Share it
Top