కేబినెట్ భేటీకి కిషన్ రెడ్డి డుమ్మా
X
కేంద్రమంత్రి పదవికి కిషన్ రాజీనామా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం జరిగిన కేంద్రమంత్రి భేటీకి ఆయన హాజరుకాలేదు. రాజీనామా చేయడం వల్లనే సమావేశానికి రాలేదని చెప్పుకుంటున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. అయినా ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు కిషన్ రెడ్డి. మరోవైపు మంత్రిత్వశాఖ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు. దీంతో కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.
నిన్న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించింది. బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన దగ్గర నుంచి ఆయన మీడియా ముందుకు ఇప్పటి వరకూ రాలేదు. అసలు మాట్లాడటానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలోని ఉండి కూడా ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. సాయంత్రం కిషన్ రెడ్డి బాటలోనే మరికొందరు కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేయనున్నారని సమాచారం.
తెలంగాణ అధ్యక్ష పదవి మీద కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పదవి ఇచ్చినా పైర్తి బాధ్యతలు మాత్రం ఇవ్వలేదని....ఇప్పటివరకు లేని ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవిని ఇప్పుడెందుకు సృష్టించారని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. పేరుకి అధ్యక్ష పదవే అయినా పోటీగా ఈటెల రాజేందర్ కూడా ఉన్నరని ఆయన భావిస్తున్నారుట. ఎన్నికల్లో ఎవరు నిలబెడతారనేది ఎవరు నిర్ణయిస్తారన్నదాని మీద కూడా సందిగ్ధం నెలకొంది. ఈటెల కూడా తన వంతుగా కొన్ని పేర్లు తీసుకురావచ్చని చెబుతున్నారు.