Home > జాతీయం > Kishan Reddy : కాంగ్రెస్‌వి ఫేక్‌ గ్యారంటీలు.. నమ్మే పరిస్థితి లేదు: కిషన్‌రెడ్డి

Kishan Reddy : కాంగ్రెస్‌వి ఫేక్‌ గ్యారంటీలు.. నమ్మే పరిస్థితి లేదు: కిషన్‌రెడ్డి

Kishan Reddy : కాంగ్రెస్‌వి ఫేక్‌ గ్యారంటీలు.. నమ్మే పరిస్థితి లేదు: కిషన్‌రెడ్డి
X

ఎన్నిక ఏదైనా సరే.. ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా తాము చెప్పిందే చేస్తామని, చేసేదే చెప్తామని అన్నారు కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అదే తమ ట్రాక్ రికార్డ్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఒక్క బీజేపీనే అని అన్నారు. మిగతా పార్టీల నేతలు మాట్లాడే మాటలు కోటలు దాటుతాయి.. కానీ వారు చేసే పనులు ప్రగతి భవన్‌, గాంధీభవన్‌ కూడా దాటవని ఎద్దేవా చేశారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు చేస్తూ మండిపడ్డారు.

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. సీఎం కేసీఆర్ పదవి పోవడం, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ బస్తీలలో ప్రజలను అధికారపార్టీ నాయకులు బెదిరిస్తూ.. గుండాయీజం చేసినా ప్రజలు స్వచ్చంధంగా ముందుకొస్తున్నారని అన్నారు. ఒక నిశబ్ద విప్లవం తరహాలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రచార రథాలను గ్రామాల్లోకి రానివ్వకుండా ప్రజలే అడ్డగిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. దళితబంధు, రుణమాఫీ, బీసీ బంధు, దళిత ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చలేదని ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పోలీసులకు భయపడిన వారు కేసీఆర్‌ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని నిర్ధారించుకొని ముందుకొస్తున్నారు

రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు ఎక్కడకు వెళ్లినా మంచి ఆదరణ వస్తోందని.. తమ మేనిఫేస్టోను ప్రజలు రిసీవ్ చేసుకున్నారని అన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ వారిని ఆకర్షించిందని, యూత్ అంతా నరేంద్రమోదీకి అండగా నిలబడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్‌ కుటుంబాల నుంచి వచ్చినవారు సైతం బీజేపీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ పై ఫైర్ అవుతూ.. "స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్‌ అనేక గ్యారంటీలు ఇచ్చింది. ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ విషాదమే మిగిల్చింది. కాంగ్రెస్‌ కారణంగా తెలంగాణ అనేక రకాలు నష్టపోయింది. తొలి విడత ఉద్యమంలో 365 మందిని, మలి విడతలో 1200 మంది విద్యార్థులను బలితీసుకుంది. ఆ పార్టీ ప్రస్తుతం ఇస్తున్న ఫేక్‌ గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.




Updated : 20 Nov 2023 6:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top