Home > జాతీయం > Gujarat: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన డాక్టర్ నిర్లక్ష్యం..

Gujarat: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన డాక్టర్ నిర్లక్ష్యం..

Gujarat: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన డాక్టర్ నిర్లక్ష్యం..
X

కత్తిపోట్లకు గురైన యువకుడు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కు వెళ్తే.. అక్కడ వైద్యం చేయాల్సిన డాక్టర్ మిడిమిడి జ్ఞానంతో తనకు తెలిసిన ట్యాబ్లెట్లు ఏవో ఇచ్చి పంపించాడు. ఆ ట్యాబ్లెట్లతో తనకు తగిలిన గాయాలు మాయమైపోతాయని అతడు భావించి.. క్రమం తప్పకుండా ఆ మందులు వాడాడు. కానీ కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. ఆ నొప్పి తోనే ఎన్నో ఆస్పత్రులు తిరుగుతూ నరకం అనభవించాడు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య ఏదో ప్రమాదమై ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లగా అక్కడ అసలు నిజం తెలిసి అవాక్కయ్యాడా యువకుడు. కత్తిపోట్లకు గురైన సమయంలో.. ఓ కత్తి అతడి కడుపులో ఉందన్న నిజం తెలిసి... అతడితోపాటు కుటుంబ సభ్యులు కూడా షాకైన ఘటన గుజరాత్​లో భరూచ్​ జిల్లా అంకాలేశ్వర్​లో జరిగింది.

అంకాలేశ్వర్​కు చెందిన అతుల్​ గిరీ అనే యువకుడు ఐదేళ్ల క్రితం కత్తిపోట్లకు గురయ్యాడు. అప్పుడు వైద్యం కోసం స్థానికంగా ఉన్న భరూచ్​ సివిల్​ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న డాక్టర్.. అతుల్ ని సరిగ్గా పరీక్షించకుండానే ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపించాడు. క్రమంగా అతుల్​కు కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేవాడు. అయితే అతుల్​ ఐదేళ్ల తర్వాత ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. అనంతరం అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అతుల్​ తాను ఐదేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు డాక్టర్లకు తెలిపాడు. దీంతో డాక్టర్లు అతడికి పూర్తి బాడీ చెకప్​ చేశారు. అతుల్ ఎక్స్​-రే రిపోర్ట్​లో కత్తిని చూసిన డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కడుపులో కత్తి ఉందని.. అసలేం జరిగిందో తెలుసుకొని విస్తుపోయారు. కడుపులో ఉన్న కత్తిని మరో రెండు మూడు రోజుల్లో సర్జరీ నిర్వహించి బయటకు తీయనున్నట్లు తెలిపారు. ఇలా ఓ సివిల్ ఆస్పత్రి డాక్టర్ నిర్లక్ష్యం.. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.

Updated : 30 Oct 2023 8:09 AM IST
Tags:    
Next Story
Share it
Top