అయోధ్యలో కోహ్లీ డూప్..సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్
X
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ డూప్ టీమిండియా జెర్సీ ధరించి వచ్చాడు. దీంతో డూప్‌తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. కొందరైతే అతన్ని చూసి నిజమైన కోహ్లీ అనుకోని దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా కోహ్లీ డూప్ తో సెల్ఫీల కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎగబడటంతో పోలీస్ సిబ్బంది అతనికి రక్షణ కల్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఇండియా జర్సీ వేసుకున్న వ్యక్తి అచ్చం కోహ్లీలా కనిపించాడు. దీంతో అతనితో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడటం ఆ వీడియోలో కనిపించింది. అయోధ్యలో నిన్న జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానం పంపింది.
సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తమ భాగస్వాములతో హాజరయ్యారు. ఆహ్వానం అందినా కూడా కొంతమంది ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. వాస్తవానికి అయోధ్య వేడుకకు రావాలని క్రికెటర్ కోహ్లీని ఆహ్వానించారు రామాలయ నిర్వాహకులు. కానీ విరాట్ కోహ్లీ రామాలయ ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. అయితే.. డూప్లికేట్ విరాట్ కనిపించడంతో జనాలు అతని చుట్టూ గుమికూడారు. సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. టీమిండియా ఇంగ్లండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడబోతుంది. మూడు టెస్టులకు గాను తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడట్లేదని బీసీసీఐ అధికారులు చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు జరగనుంది.
Duplicate Virat Kohli at Ayodhya.
— Johns. (@CricCrazyJohns) January 22, 2024
- People going crazy after seeing Duplicate Virat Kohli. [Piyush Rai]pic.twitter.com/eJeWkr5TBJ