Home > జాతీయం > రాజకీయప్రస్థానం కన్ఫార్మ్ అయినట్టేనా?

రాజకీయప్రస్థానం కన్ఫార్మ్ అయినట్టేనా?

రాజకీయప్రస్థానం కన్ఫార్మ్ అయినట్టేనా?
X

విజయ్ రాజకీయ ప్రవేశం మీద ఇప్పటి వరకు కోలీవుడ్ పత్రికలు ఒక్కటే వార్తలు రాస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు విజయ్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడంటూ ఏకంగా నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అతను రాజకీయాల్లోకి రావడం కన్ఫార్మ్ అంటున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో అత్యంత హాట్ టాపిక్ విజయ్ పాలిటిక్స్ ఎంట్రీ. కోలీవుడ్ మీడియా దీని మీద రోజుకో వార్త రాస్తూనే ఉంది. ఇప్పుడు అతను పాదయాత్రకు సిద్ధమైనట్లు జాతీయమీడియాలో వార్తలు రావడంతో ఇది మరింత సెన్సేషనల్ న్యూస్ గా మారింది. ఈ మధ్య కాలంలో దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం సంఘం సభ్యలతో తరచూ మీటింగ్ లు పెడుతున్నారు. నిన్న కూడా ఓ సమావేశం జరిగింది. అందులో విజయ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లియో సినిమా విడుదల కంటే ముందే ఈ యాత్రను ప్రారంభించాలని అనుకుంటున్నారుట కూడా. లియో మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఇప్పటికి అయితే దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు కానీ...త్వరలోనే రావొచ్చని తెలుస్తోంది.

విజయ్ ఈ మధ్య తరచుగా ప్రజల్లో కనిపిస్తున్నారు. విద్యార్ధులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. ఆ సమయంలో ఇచ్చిన స్పీచ్ లు కూడా విజయ్ రాజకీయ ప్రవేశాన్ని కన్ఫార్మ్ చేసేవిగా అనిపించాయి. మీడియాలో వస్తున్న వార్తలను కూడా దళపతి ఎప్పుడూ ఖండించినట్టుు కనిపించలేదు. ఇప్పటివరకూ ప్రకటన అయితే చేయలేదు కానీ బ్యాగ్రౌండ్ లో మాత్రం అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త సినిమాలు కూడా ఏవీ సైన్ చేయలేదు.

Updated : 12 July 2023 2:33 PM IST
Tags:    
Next Story
Share it
Top