కోలుకుని బ్యాట్ పట్టిన లాలూ.. మిగిలింది ఇక బెయిలే
X
ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా ధల్) నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇటీవలే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. గడిచిన ఎనిమిది నెలలుగా బెడ్ కే పరిమితమైన లాలూ.. కాస్త హుషారుగా కనిపించారు. సర్జరీ నుంచి కోలుకుని బ్యాట్ పట్టారు. చాలా రోజుల తర్వాత కోర్ట్ లోకి దిగి బ్యాడ్మింటన్ ఆడారు. లాలూ బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను ఆయన కొడుకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ఓ హిందీ పాటను కూడా అటాచ్ చేశారు. తన తండ్రి ధీరుడని, పోరాట యోధుడని, జైలు శిక్ష గురించి భయపడరని, అన్నిట్లో గెలిచి తిరిగొస్తారని పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు.
దాణా కుభకోణాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్.. ప్రస్తుతం మెడికల్ గ్రౌండ్స్ తో బెయిల్ లో ఉన్నారు. లాలూ గడిచిన ఎనిమిది నెలలుగా బీహార్ కు వెళ్లలేదు. 75 ఏళ్ల లాలూ.. గతేడాది డిసెంబర్ 5న సింగపూర్ కు వెళ్లి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.