Home > జాతీయం > విమాన టికెట్ ధరకు రెక్కలు.. ఆ దేశంతో పోల్చితే ఇక్కడే ఎక్కువ

విమాన టికెట్ ధరకు రెక్కలు.. ఆ దేశంతో పోల్చితే ఇక్కడే ఎక్కువ

విమాన టికెట్ ధరకు రెక్కలు.. ఆ దేశంతో పోల్చితే ఇక్కడే ఎక్కువ
X

ప్రపంచ వ్యప్తంగా ఏవియేషన్ రంగం ఇంత అభివృద్ధి చెందినా కొన్ని బిజీ రూట్లలో ప్రయాణించాలంటే మాత్రం టికెట్ రేట్లు ఆకాశానంటుతున్నాయి. అన్నింటికంటే డొమెస్టిక్ ట్రావెట్ మరింత ఖరీదుగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ముంబై ప్రయాణించాలంటే.. ఒక రోజు ముందు బుక్ చేసుకున్నా.. సుమారు రూ.14 వేలు ఖర్చు అవుతోంది. ఈ ధర ప్రపంచంలోని బిజీ నగరాల టికెట్ రేట్లలో రెండోది అత్యధికం కావడం గమనార్హం. అయితే, దీనికి కారణం ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బలమే కారణం అని ఓ నివేదికలో తేలింది.

ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్ జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా పోల్చితే విమాన టికెట్ ధరలు భారత్ లోనే 41శాతం అధికంగా పెరిగినట్లు తెలిపింది. తర్వాత స్థానాల్లో యూఏఈ 34శాతం, సింగపూర్ 30శాతం, ఆస్ట్రేలియా 23శాతం ఉన్నాయి. భారత్ తో పాటు ఇండోనేషియా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, జపాన్ దేశాల్లోనూ ఈ ఏడాది టికెట్ రేట్లు పెరిగాయి. ఇదిలా ఉంటే.. కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఏవియేషన్ సెక్టార్ కు అధిక టికెట్ రేట్లు ఇప్పుడు ముప్పుగా మారాయి.

Updated : 13 Jun 2023 11:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top