OYO బుకింగ్స్లో హైదరాబాదే టాప్.. మిగతా నగరాలన్నీ తర్వాతే
X
ప్రముఖ నగరాలను వెనక్కి నెట్టి.. ఓయో బుక్కింగ్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ట్రావెలోపీడియా 2023 పేరిట ఓయో.. ఓ నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాల్లో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. ఉత్తర్‌ప్రదేశ్ తొలి స్థానంలో, మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచాయి. నగరాలు, రాష్ట్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల వారీగా ర్యాంకులను తన నివేదికలో ఓయే పొందుపరిచింది. 2023లో ఎక్కువ బుక్కింగ్స్ నమోదైన నగరాల్లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీ, కోల్ కతా రెండు మూడో స్థానాల్లో నిలిచాయి. గతేడాదితో పోల్చితే.. గోరఖ్‌పూర్, దిఘా, వరంగల్, గుంటూరు నగరాలు కూడా మెరుగైన వృద్ధిని సాధించాయి. ఆధ్యాత్మిక నగరాల జాబితాలో పూరి మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత అమృత్ సర్, వారణాసి, హరిద్వార్ ఉన్నాయి.
టూరిస్ట్ స్పాటుల్లో ఎక్కువగా బుక్ అయిన సిటీల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలవగా.. గోవా, మైసూర్, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రాల వారిగా చూసుకుంటే.. తొలి స్థానంలో ఉత్తర్ ప్రదేశ్.. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. సెప్టెంబర్ 30న అత్యధికంగా బుక్కింగ్స్ జరిగాయి.