Home > జాతీయం > విడాకులు ఎలా ఇస్తాం.. సహజీవనంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విడాకులు ఎలా ఇస్తాం.. సహజీవనంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విడాకులు ఎలా ఇస్తాం.. సహజీవనంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

సహజీవనంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సంబంధాలను వివాహాలుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను మ్యారేజ్గా గుర్తించే చట్టం ఏదీ లేదనీ, కేవలం పరస్పర ఒప్పందం ఆధారంగా ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తే అది వివాహ చట్టం పరిధిలోకి రారనీ తేల్చిచెప్పింది. జంటలు సహజీవనం చేసినంత మాత్రాన అది పెళ్లితో సమానం కాదని, వారికి విడాకులు మంజూరు చేయలేమని జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందినవారు 2006 నుంచి రిజిస్టర్ అగ్రిమెంట్ ప్రకారం సహజీవనం చేస్తున్నారు. వారికి 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. కొన్ని కారణాలరిత్యా తమ సంబంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవడంతో వారు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే వారికి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించడంతో వారిద్దరూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

విడాకుల పిటిషన్ పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు సైతం వారి రిలేషన్ను పెళ్లిగా గుర్తించలేమని స్పష్టం చేసింది. దేశంలో అమల్లో ఉన్న వివాహ చట్టాల ప్రకారం పెళ్లి జరిగితేనే దాన్ని చట్టం గుర్తిస్తుందని చెప్పింది. ఒప్పందం ప్రకారం ఇద్దరు సహజీవనం చేస్తే దాన్ని పెళ్లిగా గుర్తించలేమని, ఇలాంటి కేసుల్లో విడాకులు అడిగే అర్హత వారికి ఉండదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.

Updated : 14 Jun 2023 10:01 AM IST
Tags:    
Next Story
Share it
Top