Home > జాతీయం > Leopard Police Station : పోలీస్ స్టేషన్లో చొరబడిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే..?

Leopard Police Station : పోలీస్ స్టేషన్లో చొరబడిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే..?

Leopard Police Station  : పోలీస్ స్టేషన్లో చొరబడిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే..?
X

జనావాసాల్లోకి అడవి జీవులు రావడం కామన్ అయిపోయింది. అడవులు తగ్గుతుండడంతో కోతి నుంచి మొదలు చిరుత వరకు జనావాసాల్లోకి వస్తున్నాయి. పశువులు, మనుషులపై చిరుతల దాడులు పెరిగిపోయాయి. తాజాగా ఓ చిరుత ఏకంగా పోలిస్ స్టేషన్లోకి వచ్చింది. దీంతో అక్కడున్న సిబ్బంది భయాందోళన చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

రత్నగిరి జిల్లాలోని రాజాపూర్ పోలీస్ స్టేషన్లోకి చిరుత ప్రవేశించింది. దీంతో సిబ్బంది భయంతో లోపలికి పరుగులు తీశారు. నిజానికి చిరుత కుక్కలను తరిమింది. భయానికి ఆ కుక్కలు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లాయి. దీంతో చిరుత వాటిని వెంబడిస్తూ స్టేషన్ లోకి చొరబడింది. ఒక రూంలోకి వెళ్లి కుక్కను పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.




Updated : 27 Jan 2024 8:57 PM IST
Tags:    
Next Story
Share it
Top