LIC : విద్యార్థులకు ఎల్ఐసీ గుడ్‌న్యూస్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిలా!
X
ప్రతిభ గల పేద విద్యార్థులకు ఆర్థిక భరోసాను కల్పించాలని ఉద్దేశంతో గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం - 2028 పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉపకారవేతనాన్ని అందిస్తోంది. జనరల్,స్పెషల్ గర్ల్ చైల్డ్ పేరుతో ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. . ఈ కింది వివరాల అధారంగా ఈ ఉపకారవేతనానికి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
.జనరల్, స్కాలర్‌షిప్
అర్హత:
2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ విద్యా సంస్థలలో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్య అభ్యసిస్తున్న వారు ఈ ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించి ఉండకూడదు.
స్కాలర్‌షిప్ విధానం:
మెడిసిన్ విద్యార్థులకైతే ఏటా రూ.40వేలు ఇస్తారు. ఇది మూడు విడతలుగా ఉంటుంది. ఇంజినీరింగ్ విద్యార్థులైతే ఏడాదికి రూ.30 వేలు ఇస్తారు డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు చేసేవారికైతే ఏటా రూ.20వేల చొప్పున ఇస్తారు.
స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్
పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత చదువులను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టారు.
అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో పదో తరగతి పాసై ఉండాలి.
అలాగే తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు.
ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఈ ఉపకారవేతనం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అందిస్తారు.
ఎంపిక విధానం: పదో తరగతి లేదా ఇంటర్ లో పొందిన మార్కుల, కుటుంబ ఆర్థిక పరిస్థితి అధారంగా తీసుకుని ఈ స్కాలర్ షిప్‌నకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 14-01-2024 ( ఆన్లైన్ )
వెబ్సైట్: https://licindia.in/documents/d/guest/gjf-scholarship-scheme-2023