Home > జాతీయం > LIC : పిల్లల కోసం అద్భుత స్కీమ్..భవిష్యత్తుకు గ్యారెంటీ!

LIC : పిల్లల కోసం అద్భుత స్కీమ్..భవిష్యత్తుకు గ్యారెంటీ!

LIC : పిల్లల కోసం అద్భుత స్కీమ్..భవిష్యత్తుకు గ్యారెంటీ!
X

ఎల్ఐసీ అంటే ప్రజలకు ఎప్పుడూ గొప్ప భరోసా ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా ప్రజల కోసం కొత్త కొత్త పథకాలను తెస్తూ ఉంటుంది. చాలా మంది ఆ పథకాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అన్ని రకాల పథకాలను ఎల్ఐసీ ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా మరో కొత్త పథకంతో ప్రజల ముందుకొచ్చింది. పిల్లల చదువుల కోసం పొదుపు చేయాలనుకునేవారికి ఇదొక అద్భుత స్కీమ్ అని చెప్పాలి. ఈ కొత్త స్కీమ్ పేరు అమృత్ బాల్. ఫిబ్రవరి 17వ తేది నుంచి ఆ పాలసీ అందరికీ అందుబాటులోకి వచ్చింది.





ఈ పాలసీలో అతి తక్కువ కాల వ్యవధి ఉంది. ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించే అవకాశం కూడా ఉంది. మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే..ఈ ప్లాన్‌లో జమ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు ఏడాదికి రూ.80 చొప్పున ఎల్ఐసీ ఇస్తుంది. అంతేకాకుండా ప్రీమియం కాల వ్యవధిలో బీమా హామీ కూడా ఉంది. ఈ పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లుగా ఉంది. పిల్లలు పుట్టిన 30 రోజుల నుంచి 13 ఏళ్ల వయసు పిల్లల వరకూ ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంది. మెచ్యూరిటీ కనిష్ట వయసు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 25 ఏళ్లుగా ఉంది.





ఎల్ఐసీ అమృత్ బాల్ పథకంలో కనీసం రూ.2లక్షల నుంచి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు. ప్రీమియం చెల్లింపు వ్యవధి కనీసం ఐదేళ్ల నుంచి ఆరు, ఏడు ఏళ్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. పాలసీ చెల్లించే సమయంలో పాలసీహోల్డర్‌ ఏదైనా అనుకోని సంఘటన వల్ల మరణిస్తే డెత్ బెనిఫిట్స్ కూడా నామినీకి లభించనుంది. ఈ పాలసీ కింద రుణ సదుపాయాన్ని కూడా ఎల్ఐసీ కల్పిస్తోంది. మరెందుకు ఆలస్యం వెంటనే మీ పిల్లల మీద ఈ పాలసీని తీసుకుని వారి భవిష్యత్తుకు గ్యారెంటీని ఇవ్వండి.


Updated : 18 Feb 2024 8:57 AM IST
Tags:    
Next Story
Share it
Top