Post Office : రూ.10 వేల పెట్టుబడితో జీవితాంతం ఆదాయం
X
డబ్బులు సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. అందులో కూడా రిస్క్ లేని జాబ్ చేసి లేదంటే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కొందరు అధిక పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడరు. మరికొందరు ఒకరి కింద పనిచేయకుండా సొంతంగా వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటారు. వారందరి కోసం పోస్టాఫీస్ ఓ చక్కటి బిజినెస్‌ను తీసుకొచ్చింది.
పోస్టాఫీస్ తీసుకొచ్చిన ఆ స్కీమ్‌లో పదివేల రూపాయలు డిపాజిట్ చేసి దాని ద్వారా జీవితాంతం ఆదాయాన్ని పొందొచ్చు. ఆ బిజినెస్ పేరే పోస్ట్ ఆఫీస్ ప్రాంచైజ్ స్కీమ్. ఈ పథకం 2024 ఫిబ్రవరి 1వ తేది నుంచి ప్రారంభం కానుంది. ప్రజలకు ఎక్కువగా పోస్టాఫీస్ సేవలను అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకానికి పదో తరగతి ఉత్తీర్ణులై స్థానిక భాష మాట్లాడితే సరిపోతుంది. అలాగే కంప్యూటర్, స్మార్ట్ ఫోన్‌పై కాస్త పరిజ్ఞానం కూడా ఉండాలి.
పోస్టాఫీస్ ఫ్రాంచైజ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు కచ్చితంగా పాన్ కార్డు కలిగి ఉండాలి. సమీపంలో ఉన్న పెద్ద పోస్టాఫీస్ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.10 వేలు డిపాజిట్ చేస్తే హెడ్ పోస్టాఫీస్ వారు ఫ్రాంచైజ్ ఇస్తారు. ఆ ఫ్రాంచైజ్ ద్వారా పోస్టాఫీస్ సేవలన్నీ మీ గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉంటాయి. లేఖలపై రూ.2, మని ఆర్డర్‌పై రూ.5ల వరకూ కమీషన్ పొందొచ్చు. అలాగే పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ అమ్మకాలపై కూడా 5 శాతం కమీషన్ పొందే అవకాశం ఉంటుంది. స్పీడ్ పోస్టులపై 7 నుంచి 25 శాతం వరకూ లాభాన్ని పొందొచ్చు. ఇలా జీవితాంతం ఆదాయాన్ని పొందొచ్చు.