Home > జాతీయం > మగసింహం అక్బర్‌తో ఆడసింహం సీత.. కోర్టుకు వీహెచ్‌పీ

మగసింహం అక్బర్‌తో ఆడసింహం సీత.. కోర్టుకు వీహెచ్‌పీ

మగసింహం అక్బర్‌తో ఆడసింహం సీత.. కోర్టుకు వీహెచ్‌పీ
X

పశ్చిమ బెంగాల్లో ఓ సింహం పేరు వివాదంగా మారింది. విశ్వ హిందూ పరిషత్ దీనిపై ఏకంగా కోర్టుకెళ్లింది. త్రిపుర నుంచి రెండు సింహాలను బెంగాల్ సఫారీ పార్క్కు తీసుకొచ్చారు. వాటిని ఒకే ఎన్క్లోజర్లో ఉంచారు. అయితే దీనిపై వీహెచ్పీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఆ ఆడ సింహం పేరు సీత.. మగ సింహం పేరు అక్బర్ కావడమే దీనికి కారణం. అటవీ శాఖ తీరుతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వీహెచ్పీ ఆరోపిస్తోంది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్ చేస్తోంది.

ఈ అంశంపై కలకత్తా హైకోర్టును వీహెచ్పీ ఆశ్రయించింది. జంతువులకు ఇటువంటి పేర్లు పెట్టడం వల్ల సెంటిమెంట్లు దెబ్బతింటాయని పిటిషన్లో ఆరోపించింది. ఆడసింహం పేరు మార్చేలా ఆదేశాలివ్వాలని కోరింది. అదేవిధంగా భవిష్యత్లో దేవతల పేర్లు జంతువులకు పెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్ ఈ నెల 20న విచారణకు రానుంది. అయితే కోర్టు దీనిపై ఏ విధంగా స్పందిస్తుందనేది సస్పెన్స్గా మారింది.

కాగా జంతువుల మార్పిడి ప్రోగ్రాంలో భాగంగా ఫిబ్రవరి 12న ఈ రెండు సింహాలు పార్క్‌కు వచ్చినట్ల అధికారులు తెలిపారు. తాము వాటికి ఎలాంటి పేర్లు పెట్టలేదన్నారు. పేర్లు పెట్టామంటూ వస్తున్న వార్తలు నిరాధారమని చెప్పారు. అవి ఇక్కడికి రాకముందే వాటికి అక్బర్, సీత పేర్లు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Updated : 17 Feb 2024 9:03 PM IST
Tags:    
Next Story
Share it
Top