మందుబాబులకు షాక్.. మద్యం రేట్లు పెంపు..!
X
మద్యం ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం నుంచి బ్యాడ్ న్యూస్ అందింది. శుక్రవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ఇండియన్ మేడ్ లిక్కర్‌పై ఎక్సైజ్ డ్యూటీని కర్ణాటక ప్రభుత్వం 20 శాతం, బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం పెంచారు. దీంతో కర్ణాటకలో మధ్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ పెంపు తరువాత కూడా కర్ణాటకలో లిక్కర్ ధరలు పొరుగు రాష్ట్రాల కన్నా తక్కువగానే ఉంటాయని సిద్ధరామయ్య తెలిపారు.
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శుక్రవారం ఉదయం కర్ణాటక అసెంబ్లీలో 14వ సారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ప్రధానంగా ఆదాయ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కర్ణాటక బడ్జెట్ మొత్తం వ్యయం 3,27,747 కోట్ల రూపాయలుగా సిద్ధరామయ్య ప్రభుత్వం అంచనా వేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఐదు ఉచిత పథకాలను అమలు చేయడానికి ప్రత్యేకంగా 52,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎక్సైజ్ శాఖకు ఆదాయ సేకరణ లక్ష్యాన్ని రూ. 36,000 కోట్లుగా నిర్ణయించింది. అత్యధికంగా విద్యారంగానికి రూ.37,587 కోట్లను కేటాయించింది.