Ayodhya ram mandir: 2100 కిలోల గంట, 7 వేల కిలోల రామ్ హల్వా.. ఒకటా రెండా..అయోధ్య రామయ్యకు తీరొక్క కానుకలు
X
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శోభ దగ్గర పడుతున్న కొద్దీ.. భక్తుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. ఇప్పటికే ప్రముఖులందరికీ ఆహ్వానం అందింది. ఇవాళ్టి నుంచి సంప్రదాయ క్రతువులు ప్రారంభం అయ్యాయి. మందిరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందిరంలో ప్రతిష్టిచేందుకు కర్నాటక మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమను ఎంపిక చేశారు. 150-200 కిలోల బరువుతో ఐదేళ్ల వయసున్న బాల రాముడి రూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నారు. భక్తులు పంపిన కానుకలు ఒక్కొక్కటిగా అయోధ్యకు చేరుతున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య రామమందిరం ప్రారంభం అవుతుందన్న సందర్భంగా.. ఒకటా రెండా వందల్లో కానుకలు రామయ్య పాదాల చెంతకు చేరుతున్నాయి.
అత్తింటి నుంచి కానుకలు:
ఇటీవల సీతమ్మ జన్మించిన నేపాల్ లోని జనక్పుర్ నుంచి వందలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. రాముడికి బంగారు, వెండి కానుకలు, ఆభరణాలు సమర్పిస్తున్నారు. దాదాపు 800 మంది భక్తులు 500 కానుకలు తీసుకొచ్చారు. జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో తామెంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. త్రేతాయుగంలో రాముడికి, సీతమ్మకు స్వయంవరం జరిగింది తమ వద్దే అని గుర్తుచేసుకున్నారు. భక్తులు తీసుకొచ్చిన కానుకల్లో బంగారం, వెండి ఆభరణాలతో పాటుస స్వీట్లు, పల్లు, డ్రైఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆ కానుకల్లో వెండి పాదరక్షలు, విల్లు, బాణం, కంఠహారాలు, పట్టు వస్తాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. సీతారాముల స్వయంవర వివాహంలో జనకుడు ఎన్నో కానుకలు పంపాడని.. అదే సంప్రదాయాన్ని తాము కూడా పాటిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు.
108 అడుగుల భారీ అగర్బత్తి:
రాముడికి తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్ లోని తర్సాలీ గ్రామస్తులు.. 108 అడుగుల భారీ అగర్ బత్తీని తయారుచేశారు.108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పున్న ఈ అగర్ బత్తీని తాజాగా రామమందిరంలో వెలిగించారు. ఈ భారీ అగర్ బత్తీ ద్వారా రాముడికి రోజూ ధూపం వేసే పని తప్పుతుందని ఈ పనికి పూనుకున్న విహాభాయ్ అనే రైతు తెలిపాడు. ఈ అగర్ బత్తీని 191 కిలోల నెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడ వాడి తయారుచేసినట్లు చెప్పారు. దీని బరువు మొత్తం 3,400 కిలోలు ఉంటుంది. గ్రామస్థులంతా కలిసి ఈ అగర్ బత్తీ తయారీలో పాలుపంచుకున్నారు. కాగా ఇప్పటికే అయోధ్య చేరిన ఈ అగర్ బత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ జీ మహారాజ్ అధ్వర్యంలో ముట్టిచ్చారు.
మందిరం కోసం 2100 కిలోల గంట:
ముస్లిం కళాకారుడు ఇక్బాల్ మిస్త్రీ తయారుచేసిన 2100 కిలోల భారీ గంటను తయారుచేశాడు. చెన్నై రామేశ్వరానికి చెందిన బృందం.. వికాస్ మిట్టల్ ఫ్యాక్టరీలో ఈ గంటలను తయారైంది. 6′ X 5′ పొడువు, వెడెల్పుతో 2100 కిలోల గంట ఉంటుంది. ఈ గంటను ఒకసారి మోగిస్తే.. ఆ శబ్ధం 15 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందట. 25 మంది సభ్యులున్న దావుదయళ్ బృందం 4 నెలలు కష్టపడి ఈ గంటను తయారుచేశారు. మొత్తం రూ.21లక్షల ఖర్చు అయింది. 600 కిలోలున్న మరో గంట తమిళనాడు నుంచి అయోధ్యకు చేరింది. ప్రస్తుతం వీటిని ఆలయంలోనే భక్తుల సందర్శనార్థం ఉంచారు.
https://x.com/MeghUpdates/status/1626141448436613120?s=20
https://x.com/ANINewsUP/status/1313853483171241985?s=20
7 వేల కిలోల రామ్ హల్వా:
మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన విష్ణుమనోహర్ అనే చెఫ్.. 7వేల కిలోల రామ్ హల్వాను తయారుచేసి అయోధ్య రామమందిరంలో భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఈ హల్వా తయారి కోసం 12 వేల లీటర్ల సామర్థం ఉన్న కడాయి,10 నుంచి 12 కిలోల బరువు ఉన్న గరిటెలు, 900 కిలోల రవ్వ, వెయ్యి కిలోల నెయ్యి, వెయ్యి కిలోల పంచదార, 2000 లీటర్ల పాలు, 2500 లీటర్ల నీళ్ళు, 300 కిలోల డ్రై ఫ్రూట్స్, 75 కిలోల యాలకుల పొడితో తయారుచేస్తున్నట్లు తెలిపారు. దీని బరువు సుమారు 1400 కిలోలు ఉంటుంది.
శ్రీ కృష్ణ జన్మస్థలం నుంచి కూడా:
శ్రీ కృష్ణ జన్మస్థలం అయిన మథుర నుంచి కూడా అయోధ్య రాముడికి నైవేథ్యాలు అందుతున్నాయి. అక్కడి ప్రజలు వెయ్యి కిలోల లడ్డూలను అయోధ్యకు పంపించారు. అగ్రాకు చెందిన రామ భక్తులు 56 వెరైటీల ప్రసాదాలు తయారుచేసి అయోధ్యకు పంపిస్తున్నారు.
https://x.com/ANI/status/1747140230099218899?s=20
భారీ దీపం:
ప్రపంచంలోనే అతిపెద్ద దీపాన్ని అయోధ్య రాముడికి కానుకగా ఇచ్చారు. 28 మీటర్ల పొడవు ఉండే ఈ దీపాన్ని అయోధ్యలో వెలిగించనున్నారు. ఈ దీపం వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె, వత్తి కోసం 1.25 క్వింటాళ్ల పత్తి అవసరం పడుతుందట.
తొమ్మిది దేశాల టైంను తెలిపే గడియారం:
అనిల్ సాహు అనే రామ భక్తుడు అయోధ్య రాముడికి గడియారాలు కానుకగా ఇచ్చాడు. అవి ఒకేసారి తొమ్మిది దేశాల సమయాన్ని తొమ్మిది దేశాల సమయాన్ని తెలుపుతాయి. వీటిలో ఒకే ముళ్లు ఉంటుంది. ఈ గడియారాన్ని రామాలయం ముందు బహుమతిగా ఇచ్చారు.