Home > జాతీయం > LK Advani : అద్వానీ జీ.. రామమందిరం ప్రారంభోత్సవానికి రాకండి : ట్రస్ట్

LK Advani : అద్వానీ జీ.. రామమందిరం ప్రారంభోత్సవానికి రాకండి : ట్రస్ట్

LK Advani : అద్వానీ జీ.. రామమందిరం ప్రారంభోత్సవానికి రాకండి : ట్రస్ట్
X

యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభం కానున్నాయి. 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45కు ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఎంతోమంది ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే రామ జన్మభూమి కోసం పోరాడిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి మాత్రం హాజరుకావడం లేదు.

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను రావొద్దని రామమందిర ట్రస్ట్ కోరింది. దీంతో వారు ఈ మహోత్సవానికి వెళ్లడం లేదు. ‘‘ఆద్వానీ, మురళీ మనోహర్‌ జోషి పెద్ద వయస్కులు. వారి వయస్సు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రామాలయ ప్రారంభోత్సవానికి రావొద్దని విజ్ఞప్తి చేశాం. మా వినతిని వారిద్దరూ అంగీకరించారు’’ అని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు.


Updated : 19 Dec 2023 8:51 AM IST
Tags:    
Next Story
Share it
Top