New Parliament Opening:లోక్సభ రేపటికి వాయిదా..
X
కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం (సెప్టెంబర్ 19) తొలిసారి లోక్ సభ సమావేశాలు జరిగాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన లోక్ సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. కేంద్ర మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే బిల్లుకు సంబంధించిన కాపీలు తమకు ఇవ్వలేదని కేంద్ర ప్రతిపక్ష నాయకులు తప్పుబట్టారు. సభలో ఆందోళన చేపట్టారు. దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. బిల్లు కాపీలన్నీ డిజిటల్ ఫార్మట్ ఇచ్చామని, చెక్ చేసుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. అయినా ప్రతిపక్షాలు తగ్గకపోవడంతో.. లోక్ సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి సభను ప్రారంభిస్తారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ అని పేరు పెట్టారు. ఇదే పేరుతో బిల్లు పాస్ చేస్తారు. ప్రస్తుతం లోక్ సభలో 82 మంది మహిళా ఎంపీలు ఉండగా.. ఈ బిల్లు పాస్ అయితే ఆ సంఖ్య 181కి చేరుతుంది.