Home > జాతీయం > లోక్ సభ ఎన్నికలు..అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు

లోక్ సభ ఎన్నికలు..అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు

లోక్ సభ ఎన్నికలు..అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు
X

లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయవచ్చని స్పస్టం చేసింది. ఒక్కో నియోజకవర్గంలో ప్రచార వాహనాల సంఖ్యను 5 నుంచి 13కు పెంచింది. నామిషన్ దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 రూపాయలు ఇతర అభ్యర్థులు 25,000 రూపాయలు చెప్పున డిపాజిట్ చెల్లించాలని పేర్కొంది. అలాగే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను.. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాష తో పాటుగా.. హిందీ, ఇంగ్లీష్‌లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని తెలిపింది.

ప్రస్తుతం అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులపై పరిమితి ఉంది. ఈ నేపథ్యంలో వ్యయ పరిమితి సంబంధిత సమస్యల పరిశీలనల కోసం ఈ ఏడాది అక్టోబరులో ఈసీ ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఓటర్ల సంఖ్య పెరుగుదల, వ్యయ ద్రవ్యోల్బణ సూచీలో వృద్ధి తదితర అంశాల దృష్ట్యా అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితిని సవరించే అంశంపై ఈ కమిటీ పరిశీలన చేయనుంది. 2014 తర్వాత అభ్యర్థుల వ్యయ పరిమితిని ఈసీ సవరించలేదు. ‘2019 నాటికి ఓటర్ల సంఖ్య 83.4కోట్ల నుంచి 91 కోట్లకు, ప్రస్తుతం 92.1కోట్లకు పెరిగింది. అంతేగాక, వ్యయ ద్రవ్యోల్బణ సూచీ కూడా 2019 నాటికి 220 నుంచి 280కి, ప్రస్తుతం 301కి పెరిగింది’ అని కమిటీ నియామకం సందర్భంగా ఈసీ పేర్కొంది. అయినా వ్యయ పరిమితిని సవరించలేదని తెలిపింది

Updated : 24 Feb 2024 6:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top