Home > జాతీయం > Mahua Moitra: మొయిత్రాపై సస్పెన్షన్ వేటు..? కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

Mahua Moitra: మొయిత్రాపై సస్పెన్షన్ వేటు..? కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

Mahua Moitra: మొయిత్రాపై సస్పెన్షన్ వేటు..? కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
X

క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మొయిత్రా బహిష్కరణకు సిఫారసు చేసిన ఎథిక్స్‌ కమిటీ రిపోర్ట్‌ను ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. కేంద్రం తీరు చూస్తుంటే మహువా మెయిత్రాపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, మహువా అంశం, కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరపకుండా చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదంటున్నాయి విపక్షాలు. ఇది ఫిక్సింగ్‌, మహువాకు వ్యతిరేకంగా చిన్న ఆధారం కూడా లేదని విపక్ష సభ్యులు అంటున్నారు .

లోక్‌సభలో ప్రశ్నలు అడగటానికి డబ్బు తీసుకున్నారనేది మహువా మెయిత్రాపై ప్రధాన అభియోగం. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని ఆదేశాల మేరకు.. అదానీ గ్రూప్‌పై ప్రశ్నలు వేశారంటూ లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఫిర్యాదు చేయడంతో ఇది తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని ఎథిక్స్‌ కమిటీకి స్పీకర్‌ సిఫార్సు చేయడంతో.. పార్లమెంట్‌ నుంచి బహిష్కరించాలని రిపోర్ట్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఒకవేళ సభ ఆమోదిస్తే మహువా ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.




Updated : 8 Dec 2023 12:06 PM IST
Tags:    
Next Story
Share it
Top