Home > జాతీయం > మరో బిల్లుకు లోక్ సభ ఆమోదం.. రాష్ట్రపతి సంతకం పెడితే..

మరో బిల్లుకు లోక్ సభ ఆమోదం.. రాష్ట్రపతి సంతకం పెడితే..

మరో బిల్లుకు లోక్ సభ ఆమోదం.. రాష్ట్రపతి సంతకం పెడితే..
X

పార్లమెంట్ లో మరో బిల్లు పాస్ అయింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ది టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023కి లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ది టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023ని ప్రవేశపెట్టగా.. పార్లమెంట్ సభ్యులు బిల్లును ఆమోదించారు. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌, 1885, ది టెలీగ్రఫీ వైర్స్‌ యాక్ట్‌ 1950, వైర్‌లెస్‌ టెలీగ్రఫీ యాక్ట్‌ 1993 స్థానంలో.. ది టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023ను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును రాజ్యసభకు పంపించారు. రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తే.. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లు చట్ట రూపం దాల్చుతుంది.

Updated : 20 Dec 2023 9:12 PM IST
Tags:    
Next Story
Share it
Top