స్పీకర్ కీలక నిర్ణయం.. ఆ కమిటీలో రాహుల్కు చోటు
X
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటు దక్కింది. డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. అనర్హత వేటు వేయకముందు కూడా ఆయన అదే కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలె ఆయన లోక్ సభ్యత్వం పునరుద్దరించారు. దీంతో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయనను డిఫెన్స్ స్టాండింగ్ కమిటికి నామినేట్ చేస్తూ లోక్సభ బులిటెన్ విడుదల చేసింది.
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్కు కూడా ఈ కమిటీలో చోటు దక్కింది. ఇక లోక్ సభకు కొత్తగా ఎన్నికైన ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూకి వ్యవసాయం, పశుపోషణ, ఆహార ప్రాసెసింగ్ కమిటీలో స్థానం లభించింది. రాహుల్ లాగే ఇటీవల లోక్ సభ పునరుద్ధరించిన ఎన్సీపీ ఎంపీ ఫైజల్ మహమ్మద్ వినియోగదారుల స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు.
The Lok Sabha Speaker has nominated Congress MP Rahul Gandhi to the Standing Committee on Defence pic.twitter.com/woqPUFW6GC
— ANI (@ANI) August 16, 2023
పరువు నష్టం కేసులో అనర్హతకు గురైన రాహుల్.. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. 2019లో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన మార్చి 24న లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. దీంతో సుప్రీం తలుపుతట్టారు. అక్కడ రాహుల్కు ఊరట లభించింది. కింది కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని.. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు.