Home > జాతీయం > విపక్షాల అవిశ్వాసం.. అనుమతించిన స్పీకర్ ఓం బిర్లా

విపక్షాల అవిశ్వాసం.. అనుమతించిన స్పీకర్ ఓం బిర్లా

విపక్షాల అవిశ్వాసం.. అనుమతించిన స్పీకర్ ఓం బిర్లా
X

మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ వైఖరిని నిరసిస్తూ విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు తేదీ, సమయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఆగ‌స్టు 11న ముగియ‌నున్నాయి. ఈ లెక్కన చూస్తే లోక్‌స‌భ‌లో విప‌క్ష పార్టీలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చించేందుకు కేవ‌లం 13 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చను షెడ్యూల్‌ చేసేందుకు లోక్‌స‌భ స్పీక‌ర్ 10 రోజ‌లు స‌మ‌యాన్ని తీసుకునే ఛాన్సుంది.

మణిపూర్‌ హింసపై నిరసనలతో హోరెత్తిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపకపోవడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అవిశ్వాసం పెట్టడం ద్వారా ప్రధాని స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, ఇతర అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా) భావిస్తోంది. కూటమి నేతల నిర్ణయం మేరకు బుధవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వగా అందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు.

Updated : 26 July 2023 1:03 PM IST
Tags:    
Next Story
Share it
Top