Home > జాతీయం > రాహుల్ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించకుంటే జరిగేది ఇదే

రాహుల్ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించకుంటే జరిగేది ఇదే

రాహుల్ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించకుంటే జరిగేది ఇదే
X

పరువు నష్టం(మోడీ ఇంటి పేరు) కేసులో రాహుల్​ను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఆయన సోమవారం పార్లమెంట్​లో అడుగు పెడతారా? లేదా?.. అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అనర్హత రద్దుపై లోక్​సభ స్పీకర్ నిర్ణయం కోసం కాంగ్రెస్‌ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. తీర్పుపై స్టే విధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, శని, ఆది వారాలు పార్లమెంట్‌ ఉభయసభలకు సెలవు. దీంతో సోమవారం రాహుల్‌గాంధీ లోక్‌సభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సుప్రీంకోర్టు స్టే కు సంబంధించి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రతులను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేశారు. దీంతోపాటు ఆయనపై వేసిన అనర్హత వేటును రద్దు చేసేందుకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసి ఓం బిర్లా టేబుల్‌ ముందు ఉంచారు. ఆయన సంతకం పెట్టడమే తరువాయి రాహుల్ గాంధీ పార్లమెంటుకు వస్తారని పార్టీ నేతలు, విపక్ష కూటమి ఇండియా నేతలు ఎదురుచూస్తున్నారు. ఒక వేళ స్పీకర్ సకాలంలో స్పందించకుండా జాప్యం వహిస్తే కోర్టును ఆశ్రయించాలనీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు, పార్లమెంటు సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు ఎంత వేగంగా వేశారో.. అంతే వేగంగా ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించకుంటే విపక్షాలు అన్నీ ఐక్యంగా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తాలనీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

గతంలో లక్షద్వీప్ ఎంపీ పీపీ మొహమ్మద్ ఫైజల్‌ను తిరిగి పార్లమెంటులో చేర్చుకోవడానికి దీర్ఘ సమయం తీసుకున్నారు. ఆయనకు పడిన పదేళ్ల జైలు శిక్షను కేరళ హైకోర్టు కొట్టివేసినా పార్లమెంటు సకాలంలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. చివరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కావడానికి ముందు మార్చిలో ఆయనను తిరిగి పార్లమెంటులోకి తీసుకున్నారు. 'మోదీ' ఇంటిపేరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ.. రాహుల్‌కు సూరత్‌ సెషన్స్‌ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది.



Updated : 7 Aug 2023 11:34 AM IST
Tags:    
Next Story
Share it
Top