parliament session : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. G20 సదస్సుపై స్పీకర్..
X
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవ్వగానే విపక్షాలు నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఓం బిర్లా వారికి సర్ధిచెప్పి జీ20 సదస్సపై మాట్లాడారు. జీ20 నిర్వహణపై ప్రపంచదేశాలు భారత్ను మెచ్చుకున్నాయని స్పీకర్ అన్నారు. జీ20 సమ్మిట్తో భారత సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. మోదీ విజన్ వల్లే జీ20 సమ్మిట్ సక్సెస్ అయ్యిందని చెప్పారు. జీ20 సదస్సు విజయవంతం చేసిన ప్రధానికి ఓంబిర్లా అభినందనలు తెలిపారు. జీ20 సక్సెస్ అందరికీ గర్వకారణమని.. మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి తెలిసిందని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ సమావేశానికి ముందు మాట్లాడిన ప్రధాని మోదీ ఈ స్పెషల్ సెషన్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పారు. కొత్త భారత్ను కొత్త పార్లమెంట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. కొత్త సంకల్పం కొత్త నమ్మకంతో 2047 కల్లా ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న ప్రధాని.. భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పారు.
‘‘భారత ప్రతిష్ఠను పార్లమెంట్ పెంపొందించింది. పాత పార్లమెంట్ భవనం ఓ చారిత్రాత్మక కట్టడం. పాత భవనం నుంచి కొత్త భవనంలో అడుగుపెట్టే ఈ తరుణంలో చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. చంద్రయాన్ 3 సక్సెస్తో భారత సత్తా ప్రపంచానికి చూపించాం. జీ20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించాం’’ అని మోదీ అన్నారు.