సస్పెన్స్కు తెర.. పార్లమెంట్ స్పెషల్ సెషన్ అజెండా రిలీజ్
X
థంబ్ : స్పెషల్ సెషన్ అజెండా ఏంటంటే..
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు సభ కొలువుదీరనుండగా.. సమావేశాల అజెండాను కేంద్రం ప్రకటించలేదు. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో మోడీ సర్కారు పార్లమెంటు స్పెషల్ సెషన్ అజెండాను వెల్లడించింది.
ప్రత్యేక సమావేశాల్లో భాగంగా 18న తొలి రోజు సమావేశాల్లో భాగంగా 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు బులెటిన్లు రిలీజ్ చేశాయి. స్పెషల్ సెషన్లో లోక్‌సభలో 2 బిల్లులు, రాజ్యసభలో 3 బిల్లులపై చర్చ జరగనుంది. 18వ తేదీన పార్లమెంటు పాత బిల్డింగ్ లో సమావేశాలు ప్రారంభం కానుండగా.. 19న వినాయక చవితి రోజు నుంచి కొత్త బిల్డింగ్లో సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సమావేశాల్లో భాగంగా 75 ఏండ్ల పార్లమెంటరీ ప్రయాణంలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలతో పాటు నేర్చుకున్న పాఠాలను గుర్తు చేసుకోనున్నారు. దీంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అధర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్ మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, ది అడ్వొకేట్స్ (అమెండ్మెంట్) బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లులపై సభ్యులు చర్చించి ఆమోదం తెలపనున్నారు.