Cyclonic Circulation : పశ్చిమాన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా
X
బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా చలి తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. చలి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. బంగాళాఖాతంలో గంటకు 29 కిలోమీటర్ల వేగంతో గాలుల వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో గంట 15 కీలో మీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా.. తెలంగాణలో 13 కీలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది ప్రాంతాలను బట్టి మారుతుంది. ఏపీలో రాయలసీమతో పోలిస్తే ఉత్తరాంధ్ర, కోస్తాలో గాలుల వేగం తక్కువగా ఉండగా.. తెలంగాణలో దక్షిణ తెలంగాణ కంటే, ఉత్తర తెలంగాణలో గాలుల వేగం తక్కువగా ఉంటుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 17 సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా నమోదు అవుతుండగా.. ఇక ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏజెన్నీ ప్రాంతాల్లో మరింత కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉంది.
అల్పపీడనం ప్రభావం కారణంగా దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. జనవరి 4 వరకూ లక్షద్వీప్, దక్షిణ తమిళనాడు, కేరళలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మేఘావృతం అయి ఉంటుంది