మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెంపు
X
ఒకపక్క నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఉక్కిరిబిక్కిరవతుంటే...ఇప్పటికే కొండెక్కిన గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్‌కు 7 రూపాయల చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో సామాన్యుడికి గ్యాస్ ధర మరింత భారంగా మారింది. అయితే గృహాల్లో సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో కాస్త ఊరట కలిగింది. పెరిగిన ధరలు ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 19కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర గతంలో రూ.1,773 ఉండగా ప్రస్తుతం రూ.1,780 కు చేరింది.
కమర్షియల్ గ్యాస్ ధర పెరటంతో అది సామాన్యుడపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా భారం పడుతోంది. ప్రతీ నెలా 1తేదీ గ్యాస్ ధరలు ప్రకటించే చమురు కంపెనీ ఈ సారి మాత్రం జులై 4న పెంచాయి. గత మూడు నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరటన కల్పించింది. మే 1న కూడా సిలిండర్ ధర రూ. 172 మేర తగ్గితే, జూన్ 1న సిలిండర్ ధర రూ. 83 మేర దిగి వచ్చింది. జూలైలో మాత్రం రూ.7 రూపాయలను పెంచారు.