Lunar Eclipse: ఇవాళే చంద్రగ్రహణం.. మూతపడ్డ ఆలయాలు
X
కుమార పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ రాత్రి (అక్టోబర్ 28) రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడుతోంది. గ్రహణ కాలంలో దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలు మూసేస్తారు. దేవతారాధన, పూజలు నిలిపేస్తారు. అయితే దీనికి భిన్నంగా పూరీ జగన్నాథ క్షేత్రం రాత్రంతా తెరచి ఉంటుంది. దేవుడికి ప్రత్యేక సేవలు చేస్తూ.. భక్తులు మౌన ప్రార్థనలు చేస్తారు. గ్రహణం తర్వాత దేవతలకు మహా స్నానాలు చేయించి.. ఆలయాల సంప్రోక్షణ చేస్తారు. కాగా ఈ గ్రహణ వల్ల కొన్ని రాశుల వారికి దోశమని, మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని పురోహితులు చెప్తున్నారు.
అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశుల వారు గ్రహణ చూడొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహరాశుల వారితో పాటు అశ్వినీ నక్షత్రంలో పుట్టిన వాళ్లు గ్రహణం చూడొద్దని చెప్తున్నారు. అయితే కుమార పౌర్ణమి పూజలు, వ్రతాలు, నోములు నోచుకునే వాళ్లు శనివారం మధ్యాహ్నం 3:30 గంటల్లోగా పూర్తిచేస్తుకోవాలని తెలిపారు. భోజన కార్యక్రమాలు సాయంత్ర 4 గంటల్లోగా ముగించాలని చెప్పారు. ఈ మూడు రాశుల వారు, అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి మినహాయిస్తే.. మిగతా తొమ్మిది రాశుల వాళ్లకు శుభ ఫలితాలు కలుగుతాయని పురోహితులు చెప్పారు.