గాంధీభవన్లో మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. వారి పనే అంటూ..
X
గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం రేగింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్బీనర్ కాంగ్రెస్, పారాచూట్స్కు టికెట్ ఇవ్వొద్దంటూ ఆ పోస్టర్లలో ఉంది. గో బ్యాక్ టు నిజామాబాద్ అంటూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఇక వచ్చే ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు మధుయాష్కీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎల్బీ నగర్ నుంచి పోటీచేయాలని అనుకున్నారు. సడెన్ గా మధుయాష్కీ ఎంట్రీ ఇవ్వడంతో నియోజకవర్గంలో సీన్ మారిపోయింది.
ఈ పోస్టర్లు వేయించింది జక్కిడి ప్రభాకర్ రెడ్డే అని మధుయాష్కీ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఆయన వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. వెంటనే జక్కిడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ గాంధీభవన్లో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఉంది. పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ విడివిడిగా మాట్లాడనుంది.