Home > జాతీయం > బోరుబావిలో పడిన చిన్నారి..17 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బోరుబావిలో పడిన చిన్నారి..17 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బోరుబావిలో పడిన చిన్నారి..17 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
X

ముక్కుపచ్చలారని చిన్నారులను బోరుబావులు మింగేసినన ఘటనలు ఎన్ని జరిగినా... నిర్లక్ష్యపు ధోరణి మాత్రం జనాలను వీడటం లేదు. దేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి సంఘటనే పునరావృతం అయ్యింది. ఓ మూడేళ్ల చిన్నారి 300 ఫీట్ల లోతులో ఉన్న బోరుబావిలో పడి మృత్యువుతో పోరాడుతోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.



మధ్యప్రదేశ్ లో సీహోర్ జిల్లా ముగవాళి గ్రామానికి చెందిన మూడేళ్ల శృష్టి కుశ్వాహా మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొదట 30 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సంయుక్తంగా శృష్టి పేరుతో ఆపరేషన్‎ను మొదలు పెట్టారు. పాపను రక్షించేందుకు గత 17 గంటలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రిల్లింగ్ కారణంగా పాప మరో 20 అడుగుల లోతులోకి జారిపోయింది. ఆపరేషన్ కష్టంగా మారడంతో తవ్వకాలు నిలిపివేశారు. ప్రస్తుతం చిన్నారి 50 అడుగుల ఫీట్ల లోతులో ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరా తీశారు. తన సొంత జిల్లా కావడంతో సహాయ చర్యలను వేగవంతం చేయాలని , పాపను సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.











Updated : 7 Jun 2023 8:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top