Home > జాతీయం > వీడు మనిషేనా.. సాటి వ్యక్తిపై మూత్రం పోసిన నీచుడు

వీడు మనిషేనా.. సాటి వ్యక్తిపై మూత్రం పోసిన నీచుడు

వీడు మనిషేనా.. సాటి వ్యక్తిపై మూత్రం పోసిన నీచుడు
X

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ గిరిజనుడిపై ఓ వ్యక్తి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. ఓ షాపు మెట్లపై గిరిజనుడు కూర్చోని ఉండగా.. ఓ వ్యక్తి అతడి ముఖంపై మూత్రం పోశాడు. మరో వ్యక్తి సిగ్గులేకుండా ఈ వీడియె తీశాడు. ఈ దారుణం మూడు నెలల క్రితం జరగ్గా.. ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్గా మారింది. మూత్రం పోసిన వ్యక్తి ప్రవేష్ శుక్లా అని తెలుస్తోంది. అతడు బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా అనుచరుడని సమాచారం.

ఇక ఈ వీడియో వైరల్ అవడంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి హేయమైన చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదని మాజీ సీఎం కమల్ నాథ్ అన్నారు.మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలు అంతం కావాలన్నారు.

Updated : 4 July 2023 10:17 PM IST
Tags:    
Next Story
Share it
Top