Home > జాతీయం > మేం గెలిస్తే రూ. 450కే గ్యాస్ సిలిండర్.. బీజేపీ

మేం గెలిస్తే రూ. 450కే గ్యాస్ సిలిండర్.. బీజేపీ

మేం గెలిస్తే రూ. 450కే గ్యాస్ సిలిండర్.. బీజేపీ
X

తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌లోనూ ఎన్నికల సందడి మొదలైంది. బీజేపీ ప్రభుత్వం హామీలపై హామీలు గుప్పిస్తోంది. తిరిగి తమను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు అద్భుతమైన పథకాలు అమలు చేస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శ్రావణమాసం సందర్భంగా ఆయన ఆదివారం భోపాల్లో మహిళలతో సమావేశంపై వారి సమస్యలను విన్నారు. పలు జనాకర్షక వాగ్దానాలు చేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే గ్యాస్ సిలిండర్‌ను రూ. 450కే అందజేస్తామన్నారు. మహిళల ఆదాయాన్ని నెలకు రూ. 10 వేలకు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. లాడ్లీ బెహ్నా పథకం కింద మహిళలకు ఇస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని రూ.1,250కి పెంచుతున్నామని, ఈ నిర్ణయం వెంటన అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాఖీ కానుక కింద రూ. 250ని మహిళల ఖాతాల్లో వేశారు. ‘‘మరోసారి అవకాశమిస్తే ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లను 30 శాతం నుంచి 35 శాతానికి పెంచుతాం. ఉపాధ్యాయ నియామకాల్లో 50 శాతం కేటాయిస్తాం. శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు నెలలో అందరికీ రూ. 450కే గ్యాస్ సిలిండర్ను ఇస్తాం. తర్వాత కూడా ఆ ధరకే అందజేస్తాం. లాడ్లీ పథకం కింద 1.25 కోట్ల మంది మహిళలు రూ. 1,250 ఇస్తాం. ఈ మొత్తాన్ని దశలవారీగా రూ.3000కు పెంచుతాం’’ అని తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.


Updated : 27 Aug 2023 10:37 PM IST
Tags:    
Next Story
Share it
Top