ఒకేసారి 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
X
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యప్రదేశ్‌లో ఒకేసారి 5 వందే భారత్(Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో రెండు రైళ్లను జెండా ఊపగా.. మరో మూడింటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో.. భోపాల్-ఇందోర్, భోపాల్-జబల్‌పుర్ వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ధార్వాడ్-బెంగళూరు, రాంచీ-పట్నా, గోవా-ముంబయి వందేభారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్‌లో రెండు, కర్నాటకలో ఒకటి, బీహార్ , ఝార్ఖండ్ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఒక రైలు, ముంబై-గోవా రూట్‌లో మరో వందే భారత్ ట్రైన్ ప్రారంభమైంది. ఇప్పటివరకు భారతదేశంలో 18 వందే భారత్ రైళ్లు తిరుగుతుండగా, తాజాగా ప్రారంభించిన 5 వందే భారత్ ట్రైన్స్‌తో ఈ సంఖ్య 23కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Madhya Pradesh: PM Modi flags off 5 Vande Bharat Express trains
— ANI Digital (@ani_digital) June 27, 2023
Read @ANI Story | https://t.co/9MpOKds51I#PMModi #VandeBharatExpress #MadhyaPradesh #RaniKamalapatiJabalpur #AshwiniVaishnaw pic.twitter.com/RBl4c7tSe4