నాపై ఉచ్చ పోసిన శుక్లాను విడుదల చేయండి.. బాధితుడి వినతి
Mic Tv Desk | 8 July 2023 5:58 PM IST
X
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మనిషిపై మూత్రం’ కేసుపై మధ్యప్రదేశ్‌లో వివాదం చల్లారడం లేదు. గిరిజనుడిపై అమానవీయంగా మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే అతడు తప్పు తెలుసుకున్నాడని, అతణ్ని జైలు నుంచి విడుదల చేయాలని బాధితుడు దశ్‌మత్ రావత్ కోరారు. ‘‘అతడు ఎంతైన మా ఊరి పండిత్. తప్పు చేశానని బాధపడుతున్నాడు కాబట్టి విడుదల చేయండి. మా గ్రామానికి రోడ్డు వేస్తే చాలు. నాకు ఇంకే కోరికా లేదు’’ అని అన్నాడు. సిద్ధి జిల్లాలోని శుక్లా ఇంట్లో ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూల్చేయడం తెలిసిందే. తప్పు అతడు చేస్తే కుటుంబాన్ని శిక్షించడం సరికాదని బ్రహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్... దశ్‌మత్ కాళ్లు కడిగి నీళ్లు తలపై చల్లుకోవడం పబ్లిసిటీ స్టంట్ అని కాంగ్రెస్ మండిపడుతోంది.
Updated : 8 July 2023 5:58 PM IST
Tags: Madhya Pradesh urination case urination victim dashmat rawat pravesh Shukla upper cast atrocity cm shivraj singh chowhan
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire