Valentine's week : నేటి నుంచి మాఘమాసం...లవర్స్ డేనే..మ్యారెజ్ డే చేసుకుంటామంటున్న యువత
X
(Valentine's week)మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో...అంటూ పాడుకుంటూ వేచి చూసి జంటల కోసం మాఘమాసం రానే వచ్చింది. ప్రతి ఏడాది మాఘమాసం వస్తుంది దీంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా..! అయితే ఇది వాలెంటెన్స్ వీక్ కావడంతో పెళ్లిళ్లకు మరింత క్రేజ్ వచ్చింది. పెళ్లి ముహుర్తాలకు తోడు ప్రేమికుల రోజు కలిసి రావడంతో ఆ రోజు ఒక్కటవ్వాలని చాలా జంటలు కోరుకుంటున్నాయి.
శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం నేటి నుంచి ప్రారంభం కావడంతో..తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చేసింది. ఈ నెల11 నుంచి క్రోదా నామా సంవత్సరం రానుంది. మాఘమాసంలో లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. అయితే ఈ ముహుర్తాలకు తోడు ప్రేమికుల రోజు కలిసి రావడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చింది. పెండ్లి కోసం ఎదురు చూసే జంటలు ప్రేమికుల రోజున ఒక్కటైయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొన్ని రోజులు మూడాలు ఉన్నాయి. ఈ నెల నుంచి ఏప్రిల్ వరకు శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు పండితులు. పెళ్లిళ్లే కాక ఎంగెజ్మెంట్, శంకుస్థాపనలు, నూతన గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయడానికి అవకాశం ఉంది. ఈ నెల 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ముహూర్తాలు ఉన్నాయని సమాచారం. ఉగాది తర్వాత పెళ్లిళ్లకు రెండు నెలలు బ్రేక్ రానుంది.
ముహూర్తాలు:
ఫిబ్రవరిలో- 11, 13, 14, 15, 18, 19, 21, 22, 24
మార్చిలో- 1, 3, 7, 11, 13, 16, 17, 19, 20, 24, 25, 27, 28, 30
ఏప్రిల్‌లో- 1, 3, 4, 5, 6, 9, 18, 19, 20, 21, 22, 24, 26
కాగా ఈ నెల 14 వాలెంటైన్స్ డే రోజున ఒక్క జిల్లా వ్యాప్తంగా వందల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. లవర్స్ డే కావడంతో ఆ రోజే మ్యారెజీ డే చేసుకొవాలని జంటలు ముందుగానే డిసైడ్ అయ్యారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో..ఫంక్షన్ హాల్స్ అన్ని ముందే బుకింగ్ అయ్యాయి. దీంతో బ్యాండ్ మేళాలు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, పూజారులు, క్యాటరింగ్, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు బిజీ బిజీగా మారనున్నారు. బంగారు, వస్త్ర, పూల దుకాణాల్లో సందడి నెలకొంది.