జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు
X
ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, చండీఘడ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యాయి. ఇండ్లలోంచి బయటకు వచ్చిన రోడ్లపై పరుగులు తీశారు.
శ్రీనగర్ లో భూప్రకంపంనకు స్కూళ్లలో ఉన్న పిల్లలు భయాందోళనకు గురయ్యారు. క్లాస్ రూంల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. షాపుల యజమానులు సైతం దుకాణాలను వదిలి బయటకు వచ్చారు. గత నెలలోనూ జమ్మూ కాశ్మీర్లో భూకంపం వచ్చింది. అయితే ఈ రోజు వచ్చిన ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెప్పారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.