జమ్మూ కశ్మీర్లో భూకంపం.. 24 గంటల్లో మూడు సార్లు కంపించిన భూమి
X
జమ్మూ కశ్మీర్ ను భూకంపం వణికించింది. గడిచిన 24 గంటల్లో జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో ఐదుసార్లు భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లో మొదటి భూకంపం వచ్చింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. ఆ తర్వాత రాత్రి 9:44కు లేహ్ లో 4.5 తీవ్రతతో వచ్చింది. ఇండో చైనా బార్డర్ దోడా ప్రాంతంలో రాత్రి 9:55 గంటలకు 4.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. వీటి దాటికి ప్రజలు బెంభేలెత్తిపోతున్నారు.
ఆదివారం ఉదయం 2:16 గంటలకు ఈశాన్య లేహ్ లో 4.1తో, కత్రాలో ఉదయం 3: 50 గంటలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యాయి. రాంబన్ ప్రాంతంలో భూకంప తీవ్రత లోతు 33.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.19 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉపరితలం నుంచి ఐదు కిలో మీటర్ల కింద వచ్చినట్లుగా భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంపం దాటికి ఇండ్లలోంచి బయటకు వచ్చిన జనం రోడ్లపై పరుగులు తీశారు. అయితే ఈ రోజు వచ్చిన ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెప్పారు.