బ్రిడ్జి పైనుంచి రైల్వేట్రాక్‌పై పడిన కారు.. ఐదుగురికి తీవ్రగాయాలు
X
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నంబర్ హైవేపై వెళ్తున్న కారు అదుపు తప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఫ్లైవోవర్)పైనుంచి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు నాగపుర్- ఇంగన్‌ఘాట్ మార్గంలోని బోర్‌ఖేడి సమీపంలో 796/16 పాయింట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం నాలుగు ట్రాక్‌లు ఉండగా.. 3, 4 ట్రాక్‌ల మధ్య కారు పడింది. ఈ ప్రమాదంలో అందులోని ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కారు రైల్వే ట్రాక్‌పై పడటం చూసిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు.. ఆ మార్గంలో అరగంట సేపు రైళ్లను నిలిపివేశారు. పోలీసులతో కలిసి కారులోని క్షతగాత్రులను వెలికితీసి చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఫ్లైవోవర్‌పై కారు అదుతప్పి, కింద ఉన్న రైల్వేట్రాక్‌పై పడిందని బుటిబోరి స్టేషన్ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ట్రాక్‌పై రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇక రైల్వే అధికారులు.. కారును పక్కకు తొలగించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.