Home > జాతీయం > రైతును కోటిశ్వరుడిని చేసిన టమాటాలు

రైతును కోటిశ్వరుడిని చేసిన టమాటాలు

రైతును కోటిశ్వరుడిని చేసిన టమాటాలు
X

దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ ధరలు వింటేనే ప్రజల గుండెలు అదురుతున్నాయి. కేజీ టమాటా ధర కొన్ని చోట్లా 200 రూపాయలకు పైగా పలుకుతోంది. గతంలో కేజీలకు కేజీలు కొన్న జనం ఇప్పుడు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. సామాన్యలను భయపెడుతున్న టమాటాలు రైతులకు మాత్రం మంచి లాభాలను తెచ్చిపెడ్తున్నాయి. టమాటాలు అమ్మి ఓ వ్యక్తి నెలరోజుల్లోనే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు.

పూణెలోని తుకారాం భాగోజీ గయాకర్ అనే రైతు టమాటాలు అమ్మి నెల రోజుల్లోనే కోటిన్నర సంపాదించాడు. తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. దిగుబడి బాగా రావడంతో నెల రోజుల్లోనే 13వేల బాక్సులు అమ్మేశాడు. దీనికి 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. దీంత అతడు నెల రోజుల్లోనే కోటీశ్వరుడు అయ్యాడు. ఇక టమాటా పంట పండించేందుకు తన కుటుంబం మొత్తం కష్టపడిందని భాగోజీ తెలిపారు.

టమాటా ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో చాలా మంది రైతులు లక్షలు సంపాదించారు. పుణెలో ఒక్క నెల‌లోనే రూ. 80 కోట్ల విలువ చేసే టమాటా విక్ర‌యాలు జ‌రిగాయ‌ని రైతుల క‌మిటీ తెలిపింది. టమాటాలు రైతుల ఇంట పండుగ తెస్తే సామాన్యుల ఇంట ఇబ్బందులను తెచ్చింది. అయితే త్వరలోనే టమాట ధరలు తగ్గే అవకాశం ఉంది..

Updated : 15 July 2023 2:29 PM IST
Tags:    
Next Story
Share it
Top