ప్రియుడి మోజులో.. కన్నతండ్రినే కడతేర్చేందుకు కూతురి ప్లాన్
X
ప్రియుడి మోజులో పడి మొగుళ్లను మర్డర్ చేయడం ఈ మధ్య కొందరు ఆడవాళ్లకు.. ఆనవాయితీగా మారింది. అదేదో హ్యాపీ లైఫ్ అనుకొని.. మ్యారీడ్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేస్తూ.. మిగిలి ఉన్న జీవితాలను చివరకు జైళ్లలో గడుపుతున్నారు. ఈ మధ్య ఏపీలోని విశాఖలో జరిగిన ఘటన అలాంటిదే. ట్యాక్సీ డ్రైవర్ మోజులో పడి కానిస్టేబుల్ భర్తను చంపేసిందో ఇల్లాలు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లాలో జరిగింది. నిండా పాతికేళ్లు లేవు.. ప్రియుడితో గడపాడానికి అడ్డొస్తున్నాడని కన్నతండ్రినే కడతేర్చేందుకు ప్లాన్ వేసింది పై ఫోటోలో చాలా ఇంటిలెజెంట్‌గా కనిపిస్తున్న ఓ కూతురు. నలుగురు వ్యక్తులకు రూ.60వేల సుపారీ ఇచ్చి.. కాళ్లు విరగ్గొట్టాలనుకుంది. తండ్రి ఆమెకు చిన్నప్పటి నుంచి నేర్పించిన తెలివితేటలను ఇలా వినూత్నంగా ఉపయోగించింది. ఘటనలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల ప్రకారం.. సోలాపుర్ జిల్లాలోని మధ తాలుకాకు చెందిన మహేంద్ర షా.. ఆ చుట్టుపక్క ప్రాంతంలో పేరుమోసిన వ్యాపారవేత్త. అతని కూతురు సాక్షి.. చైతన్య అనే యువకుడ్ని ప్రేమించింది. వీరి ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని... ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఒకవేళ తండ్రి తమ గురించి ఎక్కడ వెతుకుతాడో.. ఆచూకీ తెలుసుకొని.. తమని ఎక్కడ వేరు చేస్తాడో అని భావించి..మహేంద్ర కాళ్లు విరగ్గొట్టాలని పన్నాగం పన్నారు. అందుకు ఓ ప్లాన్ కూడా వేశారు. ప్లాన్ లో భాగంగానే పుణెకు వెళ్లిన సాక్షి.. ఆదివారం రాత్రి తిరిగి మధకు వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్ దిగి తండ్రిని రమ్మని ఫోన్ చేసింది. దీంతో కూతురుని ఇంటికి తీసుకువెళ్లేందుకు కారులో వచ్చాడు మహేంద్ర.
ఇంటికి తిరిగి వెళుతుండగా.. వాడచివాడి గ్రామ సమీపంలో టాయిలెట్ వస్తుందని కారును ఆపింది సాక్షి. ఆ వెంటనే కారు వెనుకాలే రెండు బైక్‌లపై వస్తున్న నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. దారుణంగా కొట్టి.. అతని రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. బాధితుడు మహేంద్ర షామహేంద్ర అరుపులు విన్న వాడచివాడి గ్రామ ఉప సర్పంచ్ బాపు కాలే, రామ్ చరణ్ అనే మరో వ్యక్తి ఘటన స్థలానికి వచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న మహేంద్రను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. బాధితుడి కూతుర్నే ప్రధాని నిందితురాలిగా తేల్చారు. కుట్రలో ఆమె ప్రియుడి హస్తం కూడా ఉన్నట్లు నిర్ధరించారు. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.