Home > జాతీయం > ‘మోదీకి ఓటు వేసినందుకు’ నరుక్కున్నాడు.. గ్రీన్ కారిడార్ పెట్టినా అతుక్కోలేదు..

‘మోదీకి ఓటు వేసినందుకు’ నరుక్కున్నాడు.. గ్రీన్ కారిడార్ పెట్టినా అతుక్కోలేదు..

‘మోదీకి ఓటు వేసినందుకు’ నరుక్కున్నాడు.. గ్రీన్ కారిడార్ పెట్టినా అతుక్కోలేదు..
X

ప్రభుత్వం తనకు న్యాయం చేయడం లేదని, ప్రధాని మోదీకి ఓటు వేసి తప్పు చేశానని ఓ వ్యక్తి బీభత్సమైన నిర్ణయం తీసుకున్నాడు. తను వేలును తనే నరుక్కున్నాడు. అంతేకాకుండా రోజుకు ఒక్కొక్క అవయవం నరుక్కుని ముఖ్యమంత్రికి పార్సిల్ చేస్తానని హెచ్చరించాడు. వేలు నరుక్కుంటున్న తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టాడు. మహారాష్ట్రలోని ఫల్తాన్‌లో జరిగిన ఈ ఉదంతం కలకలం రేపుతోంది. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే రంగంలోకి తెగిపోయిన వేలిని తిరిగి అతికించడగా 100 కి.మీ. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అప్పటికే ఆలస్యమైందని, వేలు తిరిగి అతుక్కునే అవకాశం లేదని వైద్యులు చెప్పారు.

ధనుంజయ్ నరావరే అనే వ్యక్తి తన తమ్ముడు నందకుమార్ ఆత్మహత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నాడు. బీజేపీ ఎమ్మెల్యే పప్పు కలానీ దగ్గర పనిచేస్తున్న నందకుమార్, ఆయన భార్య ఆర్థిక ఒత్తిళ్లతో ఈ నెల 2న మేడమీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భూములు, డబ్బుల లావాదేవీల్లో కొందరి వేధింపుల వల్లే వారు ప్రాణం తీసుకున్నారని ధనుంజయ్ ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాని పోలీసులను కోరినా ఫలితం లేకపోయింది. నిందితుల్లో కొందరు బెయిళ్లు తెచ్చుకున్నారు. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో శుక్రవారం వేలు నరుక్కున్నాడు. తన సోదరుడి మృతికి తొమ్మిది మంది కారణమని వారి పేర్లను సెల్ఫీ వీడియోల వివరంగా ప్రస్తావించాడు.‘‘నిందితులకు వ్యతిరేకంగా ఎన్నో ఆధారాలున్నా పోలీసులు పట్టించుకోవం లేదు. నేను మోదీ ప్రభుత్వానికి ఓటు వేసి తప్పు చేశాను. అందుకు ప్రాయశ్చిత్తంగా ఓటు వేసిన వేలు నరుక్కుని మోదీకి, సీఎం ఏక్‌నాథ్ షిండేకి కానుకగా పంపిస్తాను. ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నకాలంలో ఇలాంటి అన్యాయం ఏమిటి?’’ అని ప్రశ్నించాడు. ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Updated : 20 Aug 2023 6:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top