అతడొక ద్రోహీ...అజిత్ పవార్‌పై శరద్ పవార్ ఫైర్
X
మహారాష్ర రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్సీపీలో చీలిక జరిగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అజిత్ పవార్ ఝులక్ ఇచ్చాడు. 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరవేశారు. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో షిండే వర్గంలో చేరారు . షిండే సర్కార్‌కు మద్దతు పలికిన కాసేపటికే డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక అజిత్ వర్గంలోని కొంతమందికి మంత్రివర్గంలో చోటు లభించింది.అజిత్ పవార్ వర్గం చేరికతో మహారాష్ట్రకు మంచే జరుగుతుందని మహారాష్ట్ర సీఎం షిండే తెలిపారు.
అజిత్ పవార్ ద్రోహి
షిండే సర్కార్‌కు అజిత్ పవార్ మద్దతు ప్రకటించడంపై శరద్ పవార్ మండిపడ్డారు. అజిత్ పవార్ ఓ ద్రోహీ అంటూ వ్యాఖ్యానించారు. వారు పార్టీని వీడినా ప్రజలు, కార్యకర్తలు తమవైపే ఉన్నారని స్పష్టం చేశారు. అజిత్ పవార్ తిరుగుబాటును ముందే ఊహించా అని చెప్పారు. ప్రధాని మోదీ ఎన్సీపీ అవినీతి పార్టీ అని విమర్శించిన తర్వాతి రోజే..అదే పార్టీ నేతలు ఇవాళ బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. దీంతో మోదీ వ్యాఖ్యలు అబద్ధమని తేలిపోయిందన్నారు.