Home > జాతీయం > ఎంత నిర్లక్ష్యం..పైకప్పు ఊడినా దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

ఎంత నిర్లక్ష్యం..పైకప్పు ఊడినా దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

ఎంత నిర్లక్ష్యం..పైకప్పు ఊడినా దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
X

మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‎కు చెందిన ఓ బస్సు గురించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‎గా మారింది. బస్సు పైకప్పు సగానికి పైగా ఊడినా రోడ్డుపై ఎక్కడా ఆగకుండా పరుగులు పెట్టింది. అటుగా వెళ్లే కొంత మంది ఈ బస్సు వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. అహెరిడిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిత్యం గడ్చిరోలి – అహెరి మధ్య ప్రయాణికులతో ప్రయాణిస్తుంటుంది. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం 6.30 గంటలకు కూడా ప్రయాణికులతో బస్సు అహెరి నుంచి గడ్చిరోలికి వెళ్లింది. అనంతరం తిరిగి 11 గంటల సమయంలో గడ్చిరోలి నుంచి అహెరికి తిరుగు ప్రయాణమైంది. 1.30 గంటల సమయానికి బస్సు అల్లపల్లి ప్రాంతానికి చేరుకోగానే దాని పైకప్పు సగానికిపైగా లేచింది. అయినా డ్రైవర్ పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా బస్సును స్పీడుగా పోనిచ్చాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు బస్సు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‎గా మారింది. ఈ విషయం కాస్త మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‎ దృష్టికి చేరుకుంది. దీంతో ఎండీ శేఖర్ చన్నెను స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




Updated : 28 July 2023 11:12 AM IST
Tags:    
Next Story
Share it
Top