Home > జాతీయం > Train Accident: ఘోర రైలు ప్రమాదం..10 మంది మృతి

Train Accident: ఘోర రైలు ప్రమాదం..10 మంది మృతి

Train Accident: ఘోర రైలు ప్రమాదం..10 మంది మృతి
X

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మధురైలోని స్టేషన్‎లో హాల్ట్ అయిన రైలులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు సుమారు 10 మంది ప్రయాణికులు మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ మధ్య రైల్వే శాఖ సహాయక చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజా అప్‏డేట్స్ ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.





లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మదురై రైల్వే స్టేషన్‌కు సమీపంలో హాల్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున రైలులో ఉన్నట్లుండి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ట్రైన్‎లోని ఓ ప్రైవేటు పార్టీ కోచ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కొంత మంది భక్తులు గ్యాస్ సిలిండర్‎ను ఉపయోగించి రైలులో వంట చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక విచారణలో తేలింది. సిలిండర్ పేలడంతో ఒక కంపార్ట్‌మెంట్‌ నుంచి మరో కంపార్ట్‌మెంట్‌కు వేగంగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు ప్రాణాలను రక్షించుకునేందుకు రైలు నుంచి బయటపడ్డారు. ఈ ఫైర్ యాక్సిడెంట్‎లో ఇప్పటి వరకు పది మంది చనిపోయినట్లు సమాచారం. మృతుల్లో ఉత్తరప్రదేశ్‎కు చెందిన ఇద్దరు మహిళలను రైల్వే సిబ్బంది గుర్తించింది.

మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ దిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో మొత్తం 63 మంది టూరిస్టులు ఉన్నట్లు సమాచారం.





సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే శాఖ తమ సిబ్బందిని రంగంలోకి దింపి హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. బోగిల్లో ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ యాక్సిడెంట్‎కు గల కారణాలు తెలుసుకుంటున్నారు. సిలిండర్ పేలడం వల్లే రైలులో మంటలు చెలరేగినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. దీంతో రైలు కోచ్‌లోకి ఓ ప్రమాణికుడు సీక్రెట్‎గా గ్యాస్ సిలిండర్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.





Updated : 26 Aug 2023 10:21 AM IST
Tags:    
Next Story
Share it
Top