Home > జాతీయం > బాంబ్ పేలుళ్లకు కుట్ర .. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

బాంబ్ పేలుళ్లకు కుట్ర .. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

బాంబ్ పేలుళ్లకు కుట్ర .. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
X

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఉగ్రదాడిని భగ్నం చేశారు పోలీసులు. నగరంలో పలుచోట్ల ఒకేసారి పేలుళ్లకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌(CCB) పోలీసులు.. ఐదుగురు తీవ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశారు. పేలుళ్లకు ప్లాన్ చేసిన వారిలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు.

వారి మొబైల్‌ ఫోన్‌లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన ఐదుగురు నిందితులు కూడా 2017లో జరిగిన హత్యకేసులో ప్రమేయం ఉన్నారని పోలీసులు తెలిపారు. జైలులో వారికి కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, వారు పేలుడు పదార్థాలను తయారు చేయడంలో శిక్షణ పొందారని తెలిపారు. నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌పై సీసీబీకి సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

Updated : 19 July 2023 11:51 AM IST
Tags:    
Next Story
Share it
Top