Home > జాతీయం > Makar Sankranti: సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న హైదరాబాద్ జనం

Makar Sankranti: సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న హైదరాబాద్ జనం

Makar Sankranti: సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న హైదరాబాద్ జనం
X

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సొంతూరుకి భాగ్యనగరం పయనమైంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వారంతా తెలుగు రాష్ట్రాల్లోని స్వంత ఊళ్లకు వెళ్తుంటారు. విద్యాసంస్థలకు, పలు ఆఫీసులకు సెలవులు ప్రకటించడంతో.. గురువారం రాత్రి నుంచే చాలామంది నగరవాసులు హైదరాబాద్ ను వీడుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున వావానాల రద్దీ కొనసాగుతోంది. కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. టోల్ ఫీజు చెల్లించే సమయంలో టోల్ గేటు వద్ద నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోకుండా టోల్ ప్లాజా యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటుంది.





హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతిని పురస్కరించుకొని వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఈ మేరకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో వాహనాల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్లపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.




Updated : 12 Jan 2024 10:16 AM IST
Tags:    
Next Story
Share it
Top