Home > జాతీయం > President Mohamed Muizzu : ఇండియాతో కయ్యం.. మయిజ్జు ప్రసంగం బహిష్కరించాలని విపక్షాల నిర్ణయం

President Mohamed Muizzu : ఇండియాతో కయ్యం.. మయిజ్జు ప్రసంగం బహిష్కరించాలని విపక్షాల నిర్ణయం

President Mohamed Muizzu : ఇండియాతో కయ్యం.. మయిజ్జు ప్రసంగం బహిష్కరించాలని విపక్షాల నిర్ణయం
X

భారత్తో కయ్యం వల్ల మాల్దీవులు భారీగా నష్ట పోతోంది. ముఖ్యంగా ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు తీరుపై ఆ దేశంలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి విపక్షాలు సహా ప్రజలు మయిజ్జు తీరుపై గుర్రుగా ఉన్నారు. భారత్తో వివాదం అక్కడి ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రస్తుతం మాల్దీవుల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో ఇవాళ మయిజ్జు ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రతిపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

అధ్యక్షుడు మయిజ్జు ప్రసంగాన్ని బహించాలని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, డెమొక్రాట్స్ పార్టీలు నిర్ణయించాయి. పార్లమెంట్ తిరస్కరించిన ముగ్గురు మంత్రులను తిరిగి నియమించడంతో అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు డెమొక్రాట్లు ప్రకటించారు. అయితే ఎండీపీ మాత్రం ఎందుకు బహిష్కరిస్తుందో కారణాలు వెల్లడించలేదు. కాగా మహ్మద్ మయిజ్జుపై ప్రతిపక్షాలు ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చాయి.

ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం లక్షద్వీప్లో పర్యటించారు. ఈ సందర్భంగా సముద్రం ఒడ్డున కూర్చొని కాసేపు సేద తీరారు. అంతేకాకుండా సముద్రంలో స్నార్కెలింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీటిపై మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

Updated : 5 Feb 2024 11:30 AM IST
Tags:    
Next Story
Share it
Top