పార్లమెంట్కు ఇవే చివరి ఎన్నికలు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
X
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్కు ఇవే ఎన్నికలు అని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్లాగా మోదీ దేశానికి జీవితకాల ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నాడని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతుందని చెప్పారు. మోదీ తనను తాను విష్ణుమూర్తి 11వ అవతారం అని అనుకుంటున్నారని అన్నారు. మతపరమైన సెంటిమెంట్తో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమంపై బీజేపీకి ఎటువంటి ఆసక్తి లేదని ఖర్గే అన్నారు. అటువంటి పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. ప్రస్తుతం బీజేపీకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందని అన్నారు. అందుకే అసోంలో కాంగ్రెస్ యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పారు. నవ భారత్ నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. నిరుద్యోగులను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైల్వేలో 30లక్షల ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు.